చిరు వల్లే వినయ విధేయ రామ పోయిందా..?
కొన్నిసార్లు ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడే మాటలు సినిమా విడుదల తరువాత ఉపయోగపడుతాయి. సినిమా హిట్ అయితే అప్పుడు అలా అన్నారు [more]
కొన్నిసార్లు ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడే మాటలు సినిమా విడుదల తరువాత ఉపయోగపడుతాయి. సినిమా హిట్ అయితే అప్పుడు అలా అన్నారు [more]
కొన్నిసార్లు ఆడియో ఫంక్షన్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మాట్లాడే మాటలు సినిమా విడుదల తరువాత ఉపయోగపడుతాయి. సినిమా హిట్ అయితే అప్పుడు అలా అన్నారు అని మాట్లాడుకోవచ్చు. అదే డిజాస్టర్ అయితే మాత్రం ఆ స్పీచెస్ చూసి ట్రోల్ల్స్ వేయడం మాత్రం మానరు. ప్రస్తుతం వినయ విధేయ రామ విషయంలో అదే జరుగుతుంది. సోషల్ మీడియా లో ఈ సినిమా పై ట్రోల్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ అప్పుడు చిరంజీవి మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. చరణ్ యాక్టింగ్ గురించి, బోయపాటి శ్రీను డైరెక్షన్ గురించి చిరు ఆకాశానికెత్తేసాడు. చిరు అలా మాట్లాడంతో ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఊహించుకున్నారు. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
చిరు బిజీగా ఉండటంతో…
వసూళ్లు ఓ మోస్తరుగా ఉన్నా అదంతా పండగ సెలవుల ప్రభావమే తప్ప మరొకటి కాదు. అసలు చిరు సినిమాను చూసే అలా మాట్లాడడా లేదా ట్రైలర్ చూసి మాట్లాడడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రంగస్థలం సినిమా గురించి చిరు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అందులో చరణ్ యాక్టింగ్ నాకు బాగా నచ్చిందని, సుకుమార్ డైరెక్షన్ నచ్చిందని, ఆది చనిపోయే సీన్ కూడా చాలా బాగుందని చెప్పాడు. రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చింది. మరి వినయ విధేయ రామ పూర్తిగా చూసి ఉంటే చిరు కచ్చితంగా కొన్ని మార్పులు చెప్పేవారని కాకపోతే ఆయన సైరా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లనే సినిమా ఇంత దారుణంగా ఫెయిల్ అయిందని చెబుతున్నారు. అదే ఆయన ఉంటే వేరేలా ఉండేదని చెబుతున్నారు. ఏదైతేనేం చరణ్ – బోయపాటి ఇద్దరు కలిసి మంచి డిజాస్టర్ ని ఇచ్చారు.