Sun Dec 22 2024 13:28:50 GMT+0000 (Coordinated Universal Time)
Vishwambhara: సిస్టర్ సెంటిమెంట్‌తో విశ్వంభర.. చిరు చెల్లెళ్లు వీరే..!
సిస్టర్ సెంటిమెంట్‌తో చిరంజీవి 'విశ్వంభర' రాబోతుందట. ఇక చిరుకి చెల్లుళ్ళుగా ఈ ముగ్గురు నటీమణులు..
Vishwambhara : 'అంజి' మూవీ తరువాత చిరంజీవి మరోసారి సోషియో ఫాంటసీ నేపథ్యంతో చేస్తున్న చిత్రం 'విశ్వంభర'. మల్టీ యూనివర్స్, పంచభూతాలు కాన్సెప్ట్ తో గ్రాఫికల్ వండర్ గా దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని తెరకేక్కిన్చాబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్‌తో రాబోతుందట.
ఈ సినిమాలో చిరంజీవికి మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారట. చెల్లెళ్ళు కోసం అన్న చేసే పోరాటమే విశ్వంభర అని తెలుస్తుంది. ఇక చిరుకి చెల్లెళ్లుగా నటించబోతున్నది ఈ ముగ్గురే అంటూ ఓ ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతుంది. ఆ పిక్ లో హీరోయిన్ సురభి కూడా ఉంది. అయితే ఈ మూవీ నిజంగానే సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతుందో లేదో అనేది తెలియాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
మూవీలోని 70 శాతం షాట్స్ ని గ్రాఫిక్ తోనే చూపించబోతున్నారట. ఈక్రమంలోనే దాదాపు 13 సెట్స్ ని నిర్మించారట. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ లోని గ్రాఫిక్స్ ఆడియన్స్ లో అంచనాలు పెంచేసాయి. మరి మూవీలో ఎలా ఉండబోతున్నాయో చూడాలి. కాగా ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక చిరుకి జోడిగా త్రిష నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
Next Story