Mon Dec 23 2024 18:09:42 GMT+0000 (Coordinated Universal Time)
Chiranjeevi : 'కేసీఆర్'కి చిరంజీవి పరామర్శ.. మెగా156 అప్డేట్ అడిగిన కేసీఆర్..!
కేసీఆర్ ని పరామర్శించేందుకు వెళ్లిన చిరంజీవిని ఇండస్ట్రీ గురించి ప్రశ్నించిన కేసీఆర్.
KCR - Chiranjeevi : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇటీవల ఆయన నివాసంలోనే ప్రమాదానికి గురై కాలు ఫ్రాక్చర్ అయిన సంగతి అందరికి తెలిసిందే. డిసెంబర్ 8న హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లోఆయనకు శాస్త్ర చికిత్స చేశారు. ఎనిమిది వారలు పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను పరామర్శించేందుకు ప్రముఖులు యశోద ఆసుపత్రికి చేరుకుంటున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇలా ఒక్కొక్కరిగా యశోద హాస్పిటల్ కి చేరుకొని కేసీఆర్ ని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇక ఈక్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా నేడు హాస్పిటల్ కి చేరుకొని కేసీఆర్ ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా ముందు మాట్లాడుతూ.. కేసీఆర్ గారు చాలా త్వరగా కోలుకుంటున్నారని, ఆపరేషన్ చేసిన 24 గంటలోనే కేసీఆర్ గారు నడిచేలా చేసినందుకు వైద్యులకు అభినందనలు తెలియజేశారు.
కేసీఆర్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక కేసీఆర్ కూడా చిరంజీవితో మాట్లాడుతూ సినిమా పరిశ్రమ గురించి తెలుసుకున్నారట. సినిమాలు ఎలా ఆడుతున్నాయి, ఇండస్ట్రీ ఎలా నడుస్తుందని కేసీఆర్ ప్రశ్నించగా.. చిరంజీవి 'అంతా బాగున్నట్లు' వెల్లడించారు. ఈక్రమంలోనే తను నటించబోయే మెగా156 'విశ్వంభర' మూవీ షూటింగ్ గురించి కూడా కేసీఆర్ తో మాట్లాడినట్లు తెలుస్తుంది. వచ్చే నెల 15 వరకు తాను షూటింగ్ కి వెళ్లడం లేదని చెప్పినట్లు తెలుస్తుంది.
Next Story