Tue Apr 01 2025 20:22:28 GMT+0000 (Coordinated Universal Time)
గాడ్ ఫాధర్.. చిరంజీవి వచ్చేశాడు
ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చిరంజీవి పాత్రను పరిచయం చేసే టీజర్ కూడా ఆకట్టుకుంటోంది. కార్యాలయం వెలుపల వేలాది మంది పార్టీ కార్యకర్తలు వేచి ఉండగా, మెగాస్టార్ చిరంజీవి కారులో రాగా.. సునీల్ తలుపు తెరిచారు. చిరు కారు దిగి ఆఫీస్‌లోకి వెళ్లిపోయారు. ఎలివేషన్ కోసం SS థమన్ అద్భుతమైన BGM ఇచ్చాడు. చిరంజీవిని ఈ గెటప్‌లో చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. 'గాడ్ ఫాదర్' భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనుంది. పూరి జగన్నాధ్, సత్యదేవ్ ఇతర ముఖ్య తారాగణం.
ఈ చిత్రం ఒరిజినల్ మలయాళంలో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించగా, పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకి చెల్లిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఇక సినిమాలో కీలక పాత్ర చేస్తున్న సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ కూడా విడుదల చేయడం విశేషం. చిరంజీవి ఇటీవల నటించిన `ఆచార్య` సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్‌చరణ్ నటించగా, కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ కు మాత్రం భారీ హైప్ ను ఈ చిన్న లుక్, టీజర్ తోనే తెప్పిస్తూ ఉన్నారు.
News Summary - The first look poster of megastar Chiranjeevi starrer ‘Godfather’ has been released
Next Story