చిరుకి కలిసొచ్చిందా? కాజల్ కి కలిసొచ్చిందా?
చిరంజీవి ఆచార్య సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. అటు నాగార్జున వైల్డ్ డాగ్, ఇటు బాలకృష్ణ BB3 సినిమాలు సెట్స్ [more]
చిరంజీవి ఆచార్య సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. అటు నాగార్జున వైల్డ్ డాగ్, ఇటు బాలకృష్ణ BB3 సినిమాలు సెట్స్ [more]
చిరంజీవి ఆచార్య సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టలేదని మెగా ఫాన్స్ కంగారు పడుతున్నారు. అటు నాగార్జున వైల్డ్ డాగ్, ఇటు బాలకృష్ణ BB3 సినిమాలు సెట్స్ మీద హడావిడి చేస్తుంటే చిరు మాత్రం మానవరాళ్లతో కుకింగ్ వీడియోస్ చేసుకుంటున్నాడు. మరి చిరు ఆచార్య ముందుకు కదలకపోవడానికి కారణం చిరు కరొనకి భయపడుతున్నాడా? లేదంటే కొరటాల ఆలస్యం చేస్తున్నాడా? కాదు కాజల్ పెళ్లి సమస్యా? ఏమైనా కూడా ఆచార్య షూటింగ్ విషయంలో మెగా ఫాన్స్ కంగారు రోజు రోజుకి ఎక్కువైపోతోంది. అయితే ఇప్పట్లో ఆచార్య సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని అంటున్నారు.
కారణం కాజల్ నిన్ననే పెళ్లి చేసుకుంది.. అప్పుడే షూటింగ్ అంటూ హడవిడి చెయ్యడమెందుకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోనివ్వండి మనకేం తొందర లేదులే అని చిరు కొరటాలకి చెప్పినట్టుగా టాక్. అంతేకాదు కొద్ది రోజులైతే కరోనా కంట్రోల్ అవుతుంది. లేదంటే ఈ లోపు వ్యాక్సిన్ వచ్చినా రావొచ్చు అని చిరు కొరటాలకి చెప్పినట్లుగా సోషల్ మీడియా టాక్. ప్రస్తుతం 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఆచార్య కోసం రామ్ చరణ్ కూడా తెమాలాలి.. ఈలోపు కాజల్ వచ్చేస్తుంది.. సో ఆచార్య షూటింగ్ మొదలెడితే ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ బరిలో ఆచార్య ని నిలపాలని కొరటాల – చిరు ఆలోచన అంటున్నారు. మరి కాజల్ పెళ్లి చిరుకి కలిసొచ్చిందా? చిరు ఇలా టైం ఇవ్వడం కాజల్ కి కలిసొచ్చిందా? అనేది మీకే తెలియాలి.