ఈ లుక్ లో బాగా ఇబ్బందిగా కనిపిస్తున్నాడే..!
సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి బాగా బరువు పెరిగాడు. మళ్లీ సినిమాల్లోకి వచ్చాక కాస్త జిమ్ చేసినా... గతంలో ఉన్న ఫిట్నెస్ ని సాధించలేకపోయాడు. అందుకు వయసు కూడా ఒక కారణం. కొన్నేళ్లుగా బాడీ ఫిట్నెస్ వదిలేసి మళ్లీ మొదలు పెట్టినా పెద్దగా పని జరగదనేది ఖైదీ నెంబర్ 150 లో అర్ధమయ్యింది. ఖైదీ నెంబర్ 150లో చిరు చాలా బరువుతో ఇబ్బంది పడ్డాడు. అది డాన్సులు చేసే విషయంలో తెలిసింది. ఇక సైరా నరసింహారెడ్డి లుక్ కోసం చిరు కాస్త బరువు తగ్గాడు. కాస్త ఫిట్ గా ఉన్నప్పటికీ.. మళ్లీ బరువు పెరుగుతూ రావడంతో.. మధ్యలో కొన్ని రోజులు సైరా షూటింగ్ ని ఆపేసిన సురేందర్ రెడ్డి ఇక పని జరిగేలా లేదని కంటిన్యూ చేసాడు.
ప్రచారం నిజమే అనిపించేలా...
ప్రస్తుతం జార్జియాలో సైరా నరసింహారెడ్డి యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సురేందర్ రెడ్డి, చిరు బరువుతో సతమతమవుతున్నాడని.. కానీ షూటింగ్ కి బ్రేకిచ్చే పరిస్థితి లేదనే ప్రచారం జరిగింది. మరి అది నిజమనిపించేలానే ప్రస్తుతం చిరు లుక్ కనబడుతుంది. జార్జియాలో సైరా యుద్ధ సన్నివేశాల్లో చిరుతో పాటు నటుడు చరణ్దీప్ ఉన్నాడు. అయితే ఆ లొకేషన్స్ లో చిరుతో నటుడు చరణ్దీప్ ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ ఫొటోస్ లో చిరు గుబురు గడ్డంతో కనిపించాడు. మోహం కూడా చిరు బరువుని స్పష్టంగా తెలియజేస్తుంది.