ఆచార్య సిద్ధంగా లేడా?
కరోనా కారణంగా అన్ని భాషల సినిమాల షూటింగ్స్ మొత్తం వాయిదా పడ్డాయి. కరోనా వచ్చి ఐదునెలల దాటిపోతున్నా కరొనకి మందు దొరకలేదు కానీ.. జన జీవనం మాత్రం [more]
కరోనా కారణంగా అన్ని భాషల సినిమాల షూటింగ్స్ మొత్తం వాయిదా పడ్డాయి. కరోనా వచ్చి ఐదునెలల దాటిపోతున్నా కరొనకి మందు దొరకలేదు కానీ.. జన జీవనం మాత్రం [more]
కరోనా కారణంగా అన్ని భాషల సినిమాల షూటింగ్స్ మొత్తం వాయిదా పడ్డాయి. కరోనా వచ్చి ఐదునెలల దాటిపోతున్నా కరొనకి మందు దొరకలేదు కానీ.. జన జీవనం మాత్రం యధావిధిగా తమతమ పనుల కోసం రోడ్డుమీదకు రావడం కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక నిన్నమొన్నటివరకు కరొనకి భయపడిన సినిమా హీరోలు నేడు ఒక్క్కొకరిగా తమ సినిమాల కోసం సెట్స్ మీదకెళుతున్నారు. ఇప్ప్పటికే బాలీవుడ్ మొత్తం షూటింగ్స్ కోసం వెళుతుంటే.. తెలుగు హీరోలు ఒక్కొక్కరిగా సినిమాల సెట్స్ మీదకెళుతున్నారు. యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలే డేర్ చేస్తున్నారు. ఇక సీనియర్ హీరోలైన బాలయ్య BB3 కోసం బాలయ్య షూటింగ్ కి సిద్ధం అంటుంటే.. సీనియర్ హీరో నాగ్ అయితే ఎకంగా వైల్డ్ డాగ్ షూటింగ్ తిరిగి మొదలెట్టేసాడు కూడా.
కానీ చిరంజీవి ఆచార్య విషయమే తేలడం లేదు. అటు కొరటాలకి ఆచార్య షూటింగ్ విషయం క్లారిటీ లేదో.. చిరు కావాలనే ఆగుతున్నాడో కానీ.. సీనియర్ హీరోలంతా డేరింగ్ గా సెట్స్ మీదకెళుతుంటే.. చిరు కామ్ గా ఉండడం మెగా ఫాన్స్ కి మింగుడు పడడం లేదు. తాజాగా రవితేజ క్రాక్ షూట్ మొదలయ్యింది. చివరి షెడ్యూల్ ని తిరిగి మొదలెట్టారు. ఇక ఆచార్య షూటింగ్ కూడా రామ్ చరణ్ షూట్ తో మొదలు కాబోతుంది అనే టాక్ నడిచినా ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు ఆచార్య టీం. మొత్తంగా హీరోలంతా షూటింగ్స్ అంటూ బయలుదేరుతున్నా చిరు నుండి కొరటాలకి ఇంకా సిగ్నల్ అందలేదు. కాబట్టే ఆచార్య షూటింగ్ పై ఎలాంటి నిర్ణయం కొరటాల తీసుకోలేకపోతున్నాడంటున్నారు.