Mon Dec 23 2024 11:39:51 GMT+0000 (Coordinated Universal Time)
హీరో నితిన్ ను స్టేజీపైనే తిట్టేసిన అమ్మ రాజశేఖర్
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేశారు.
హీరో నితిన్.. ఎటువంటి వివాదాలు లేకుండా కెరీర్ లో ముందుకు వెళుతూ ఉన్నాడు. అలాంటి నితిన్ ను కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ స్టేజీ మీదే తిట్టడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎందుకు జరిగిందనే అంశంపై లోతుగా వెళితే.. నితిన్ అమ్మ రాజశేఖర్ ను అవమానించాడట..!
అమ్మరాజశేఖర్ తెరకెక్కించిన 'హయ్-ఫైవ్' మూవీ త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ చిత్రానికి అమ్మ రాజశేఖర్ దర్శకుడు మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. హీరో నితిన్ పై మండిపడ్డారు. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ ని పది రోజుల ముందే ఇన్వైట్ చేశా. వస్తానని మాట ఇచ్చాడు. కానీ రాలేదు. హ్యాండిచ్చాడు. నితిన్ కి నేను గురువు లాంటి వాడిని. కానీ నితిన్ నన్నే మరచిపోయాడని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. కెరీర్ లో మనం ఎదిగినందుకు సహాయపడ్డవారిని మరచిపోకూడదు.. కానీ నితిన్ నన్ను మరచిపోయాడు. నితిన్ కి డ్యాన్స్ రాదు.. కానీ నేను డ్యాన్స్ నేర్పించి ఒక పొజిషన్ ఇచ్చానన్నారు అమ్మ రాజశేఖర్. కానీ నా ఫస్ట్ ప్రొడక్షన్ లో వస్తున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి నితిన్ రాలేదు. నితిన్ ప్రస్తుతం బిజీగా లేడు.. ఇంట్లో ఉండి కూడా రాలేదు. కనీసం వీడియో బైట్ ఇవ్వమని అడిగా. అది కూడా చేయలేదన్నారు. మనకు సాయం చేసిన వాళ్ళని మరచిపోకూడదు. నితిన్ కి ఎవరు అవసరమో వాళ్ళ ఫంక్షన్ కి వెళతాడు. కానీ నన్ను అవమానించాడని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు. 'నువ్వు రాలేకుంటే రాను అని చెప్పు.. కానీ వస్తానని చెప్పి ఇలా ఇన్సల్ట్ చేయొద్దు. ఒరేజ్ నితిన్ నిన్ను చాలా నమ్మాను. కానీ ఇంట్లో ఉన్నా నువ్వు రాలేదు. నేను చాలా అప్సెట్ అయ్యా' అని అమ్మ రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన అమ్మ రాజశేఖర్.. దర్శకుడిగా కూడా పలు సినిమాలు చేశారు. రణం, ఖతర్నాక్, టక్కరి లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నితిన్ టక్కరి చిత్రంలో నటించాడు. ఆ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే అందులోని పాటలు-డ్యాన్స్ కు మంచి పేరు వచ్చింది.
Next Story