Mon Dec 23 2024 11:35:40 GMT+0000 (Coordinated Universal Time)
అనీ మాస్టర్ కు కరోనా పాజిటివ్.. సరిగ్గా ఏడాది గ్యాప్ తో రెండోసారి !
గతంలో కరోనా సోకిన వారు సైతం.. మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి కరోనా నిర్థారణ అయిన విషయం
సినీ సెలబ్రిటీలను కరోనా వదలడం లేదు. నిత్యం ఏదొక సెలబ్రిటీ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఒక్క సినీ ఇండస్ట్రీనే కాదు.. ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. గతంలో కరోనా సోకిన వారు సైతం.. మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి కరోనా నిర్థారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కొరియోగ్రాఫర్, బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ అనీ మాస్టర్ కు కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆమె.. తన ఇన్ స్టా వేదికగా వెల్లడించింది.
గతేడాది కూడా.. సరిగ్గా ఇదే సమయంలో కరోనా సోకిందని చెప్పుకొచ్చింది అనీ మాస్టర్. "గతేడాది కూడా నాకు కోవిడ్ వచ్చింది. కరోనా వచ్చిన 24 రోజుల తర్వాత 2021 జనవరి 23న నాకు కరోనా తగ్గిపోయింది. మళ్లీ ఇప్పుడు 2022 జనవరి 23న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ కరోనా నా లాగా టైం మెయింటెన్ చేస్తుంది. క్వారంటైన్ చిరాకుగా, చాలా బోరింగ్గా ఉంది" అని ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే.. ఐసోలేషన్ లో ఉండి, చికిత్స తీసుకుంటోంది.
News Summary - Choreographer Anee Master Tested Covid Positive Second time
Next Story