Thu Apr 03 2025 03:08:06 GMT+0000 (Coordinated Universal Time)
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. అందరికీ బాగా తెలిసిన వ్యక్తే!!
‘సిఐడి’ సీరియల్ లో కీలక పాత్రలో కనిపించే దినేష్ ఫడ్నిస్

హిందీ నుండి దక్షిణాది భాషల్లోనూ భారీగా పాపులర్ అయిన ‘సిఐడి’ సీరియల్ లో కీలక పాత్రలో కనిపించే దినేష్ ఫడ్నిస్ మరణించారు. దినేష్ డిసెంబరు 5న మరణించినట్లు సిఐడి సహనటుడు దయానంద్ శెట్టి ధృవీకరించారు. దినేష్ వయస్సు 57 సంవత్సరాలు. ఆయన గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దినేష్ ఫడ్నిస్ డిసెంబర్ 5 న ఉదయం 12:08 గంటలకు ముంబైలోని తుంగా ఆసుపత్రిలో మరణించారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న ఆయనను గత రాత్రి వెంటిలేటర్ నుంచి తొలగించారు.
ఇండియన్ టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం సాగిన టీవీ షోలలో సీఐడీ ఒకటి. సీఐడీ సీరియల్ లో నటించడంతో పాటు ఇందులో కొన్ని ఎపిసోడ్లకు దినేష్ రచయితగాను వ్యవహరించారు. అంతేకాకుండా బాలీవుడ్ మరో టీవీ షో 'తారక్ మెహతా కా ఉల్టా ఛష్మా' లోను అతిధి పాత్రలో కనిపించారు దినేష్. అలాగే సర్ఫరోష్, సూపర్ 30 లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించారు.
Next Story