Mon Dec 15 2025 04:02:13 GMT+0000 (Coordinated Universal Time)
విజయవాడలో మోహన్ బాబు
సినీనటుడు మోహన్ బాబు విజయవాడకు చేరుకున్నారు. తిరుపతి నుంచి వచ్చిన మోహన్ బాబుకు అభిమానులు స్వాగతం పలికారు.

సినీనటుడు మోహన్ బాబు విజయవాడకు చేరుకున్నారు. తిరుపతి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మోహన్ బాబుకు అభిమానులు స్వాగతం పలికారు. ఆయన ఈరోజు పెదపారుపూడి మండలం వానపాముల గ్రామానికి వెళ్లనున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తల్లి ఇటీవల మరణించడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మోహన్ బాబు విజయవాడ వచ్చారు.
జగన్ ను కలిసేందుకు...
విజయవాడ వస్తే తెలీని ఆనందం కలుగుతుందని మోహన్ బాబు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ను కూడా మోహన్ బాబు కలిసే అవకాశముందని తెలుస్తోంది. అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కాకపోయినా ఆయన ఈరోజు సీఎం జగన్ ను కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Next Story

