Tue Sep 24 2024 14:28:21 GMT+0000 (Coordinated Universal Time)
తమ్ముడి వ్యాఖ్యలకు సూర్య ప్రాయశ్చిత్త దీక్ష
తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని, తాను మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని సినీ హీరో సూర్య ప్రకటించారు
తమ్ముడు కార్తీ చేసిన వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని, తాను కూడా మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని తమిళ సినీ హీరో సూర్య ప్రకటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ కు ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాను తమ్ముడు చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానని, తాను రేపటి నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేస్తున్నానని, పవన్ కల్యాణ్ కు సారీ చెప్పారు. తమ్ముడు అలా అని ఉండాల్సింది కాదన్నారు.
కార్తీ క్షమాపణలు...
ఒక సినిమా ప్రమోషన్ లో భాగంగా యాంకర్ అడుగుతూ లడ్డూ కావాలా నాయనా? అంటూ అనగా హీరో కార్తి లడ్డూ గురించి ఇప్పుడు ఎందుకు లెండి? అది సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వేశారు. దానిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుపట్టారు. సినిమా ఫంక్షన్లలో కూడా తిరుమల లడ్డూను కించపర్చేలా మాట్లాడటం సరికాదని అనడంతో సూర్యతో పాటు కార్తీ కూడా క్షమాపణలు చెప్పారు.
Next Story