Thu Mar 13 2025 16:45:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫిలింఛాంబర్ కు సిరివెన్నెల పార్ధీవదేహం
సీనీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధీవదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది.

సీనీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధీవదేహం ఫిలిం ఛాంబర్ కు చేరుకుంది. సినీ ప్రముఖులు ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పిస్తుననారు. దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి వచ్చి సిరివెన్నెలకు నివాళులర్పించారు. నిన్న కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు నేడు మహాప్రస్థానంలో జరగనున్నాయి. సిరివెన్నెల మృతి పట్ల దేశ మొత్తం మూగబోయింది.
దేశవ్యాప్తంగా....
ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ సంతాపాన్ని ప్రకటించారు. టాలీవుడ్ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది. సీనియర్ నటుల నుంచి నేటి హీరోల వరకూ తమతో సీతారామ శాస్త్రి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. అలాంటి పాటలు మళ్లీ టాలీవుడ్ లో వినలేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Next Story