Mon Dec 23 2024 00:52:35 GMT+0000 (Coordinated Universal Time)
SSMB29 : మహేష్ రాజమౌళి మూవీ నుంచి ఆ టెక్నీషియన్ అవుట్..!
SSMB29 సినిమాకి పని చేయను అంటూ డిఓపి సెంథిల్ కుమార్ తప్పుకున్నాడట. దీంతో రాజమౌళి..
SSMB29 : టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్ మహేష్ బాబు, రాజమౌళి 'SSMB29'. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన రాజమౌళి తదుపరి సినిమా కోసం ఇంటర్నేషనల్ వైడ్ ఇంటరెస్ట్ కనిపిస్తుంది. దీంతో ఈ సినిమాని రాజమౌళి కూడా హాలీవుడ్ స్టాండర్డ్ లో తెరకెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. అందుకోసమే హాలీవుడ్ సంస్థలతో కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాడు.
కాగా రాజమౌళి సినిమాల్లో హీరోలు, కథలు, యాక్టర్స్ మరొచ్చుగాని, టెక్నికల్ టీం మాత్రం ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు కొనసాగుతూనే వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, ప్రొడక్షన్ డిజైనర్, డిఓపి, ఎడిటర్.. ఇలా ప్రతి ఒక్కరు చాలా కాలం నుంచి రాజమౌళితో ట్రావెల్ అవుతూనే వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ టీంలో కొన్ని చేంజస్ జరుగుతున్నాయట. ప్రొడక్షన్ డిజైనర్, డిఓపి, ఎడిటర్ పోస్టులోకి కొత్త వారు రాబోతున్నారట.
ఈక్రమంలోనే డిఓపి సెంథిల్ కుమార్.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే ఈ మార్పు రాజమౌళి నిర్ణయం కాదు. సెంథిల్ కుమారే SSMB29కి పని చేయలేనని చెప్పాడట. ఈ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ గా మారి సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఈక్రమంలోనే మహేష్ సినిమా నుంచి తప్పుకున్నాడని సమాచారం. గతంలోనే రాజమౌళి సినిమాకి సెంథిల్ చేయనని చెప్పాడట. కానీ రాజమౌళి రిక్వెస్ట్ చేయడంతో.. సెంథిల్ తన డైరెక్షన్ నిర్ణయాన్ని పోస్టుపోన్ చేసుకున్నాడు.
అయితే ఈసారి మాత్రం ఇక పోస్టుపోన్ చేసుకునే ఉద్దేశం లేక.. మహేష్ సినిమాకు చేయనని రాజమౌళితో చెప్పేశాడట. దీంతో చిత్ర యూనిట్ సెంథిల్ స్థానంలోకి పిఎస్ వినోద్ పేరుని పరిశీలిస్తున్నారట. ఈ సినిమాటోగ్రాఫర్ తో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలినలో ఉన్నాయట. పిఎస్ వినోద్.. పంజా, దృవ, అలా వైకుంఠపురములో, సీతారామం సినిమాలకు డిఓపిగా చేశాడు. మరి ఈ ప్రాజెక్ట్ లోకి ఏ సినిమాటోగ్రాఫర్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.
Next Story