కలెక్షన్స్ పై గట్టిగాానే స్పందించాడుగా..
రామ్ చరణ్ ఓ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కి ప్రచారం చేయనున్నాడు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తాడు. రీసెంట్ గా చరణ్ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కు సంబంధించి ఓ ఈవెంట్ లో పాల్గొని ఆ బ్రాండ్ ను లాంచ్ చేసాడు. ఆ ఈవెంట్ తర్వాత చరణ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఆ ఇంటరాక్షన్ లో రామ్ చరణ్ కొన్ని ఆసక్తికర విషయాలు గురించి చెప్పాడు.
ఇక నుంచి నా పోస్టర్లపై నెంబర్లు ఉండవు
సినిమా సక్సెస్ కు ఆ మూవీ వసూళ్లే కొలమానమా అనే ప్రశ్న ఎదురైంది. 'రంగస్థలం' సినిమా 200 కోట్లు వసూల్ చేసిన విషయాన్ని గురించి మీడియా వారు అడిగారు. అసలు ప్రయత్నం చేస్తేనే కాదా మంచిదా కాదా అని తెలుస్తుంది. నంబర్స్ కు ఆడియన్స్ రియాక్ట్ కావడం నాకు అంతగా నచ్చలేదు. జనాల రియాక్షన్ బట్టి నిర్మాతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. నెంబర్స్ వల్ల జనాల్లో మేము లేనిపోని ఫీలింగ్ ను తీసుకొస్తున్నామా అని అనిపిస్తుంది. అందుకే ఇక నుండి నా సినిమాల పోస్టర్స్ పైన నెంబర్లు అనేవి లేకుండా చూసుకుంటా. నా నిర్మాతలకి కూడా నేను అదే చెబుతున్న అని అయన అన్నారు. ఎంత మంది సినిమాకు వచ్చారన్నదే లెక్క. పది మంది వచ్చి సినిమా బాగుంది అంటే వచ్చే సంతృప్తి ముందు ఈ నెంబర్లు సాటిస్ఫై చేయవు. అందరం స్నేహితులమే, హెల్తీ కాంపిటీషన్ కోరుకుంటున్నా' అని చరణ్ కొంచం గెట్టిగానే కలెక్షన్స్ పై కౌంటర్ ఇచ్చాడు.