కమెడియన్స్ తో ఫైట్స్ చేపిస్తాడా?
విజయ్ దేవరకొండ ద్వారా ఇండస్ట్రీలోకి ఇద్దరు టాప్ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి సినిమా తో రాహుల్ రామకృష్ణ. ఈ [more]
విజయ్ దేవరకొండ ద్వారా ఇండస్ట్రీలోకి ఇద్దరు టాప్ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి సినిమా తో రాహుల్ రామకృష్ణ. ఈ [more]
విజయ్ దేవరకొండ ద్వారా ఇండస్ట్రీలోకి ఇద్దరు టాప్ కమెడియన్స్ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి చూపులు సినిమాతో ప్రియదర్శి, అర్జున్ రెడ్డి సినిమా తో రాహుల్ రామకృష్ణ. ఈ ఇద్దరు విజయ్ దేవరకొండ సినిమాల ద్వారానే కమెడియన్స్ గా పరిచయమై ఇప్పుడు పెద్ద స్టార్స్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రియదర్శి అయితే హీరోగా కూడా మల్లేశం సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇక రాహుల్ రామకృష్ణ అయితే #RRR లాంటి భారీ బడ్జెట్ సినిమా లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ఇద్దరు కమెడియన్స్ తో ఓ యంగ్ హీరో సినిమా నిర్మించబోతున్నాడని టాక్.
మాములుగా ఈమధ్యన యంగ్ హీరోలు.. తమకు నచ్చిన వారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. చిన్న చిన్న సినిమాలు నిర్మిస్తున్నట్లుగా.. వరస ప్లాప్స్ తో సతమతమవుతున్న సందీప్ కిషన్ కూడా తానె హీరోగా నటించిన నిను వీడని నీడని సినిమాని నిర్మించుకున్నాడు. ఇప్పుడు తాజాగా తన నిర్మాణంలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ని హీరోలుగా పెట్టి సినిమా చేయబోతున్నాడట. అయితే ఆ కథ కామెడీ తో కూడుకున్నది కాదని, ఈ కమెడియన్స్ ఇద్దరు ఈ సినిమా లో యాక్షన్ తో దుమ్ము రేపుతారట. మరి ఈ కథకు హీరోలు సెట్ అయ్యారు కానీ… ఇంకా దర్శకుడు ఫైనల్ కాలేదు. సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణుడు సినిమా విడుదలయ్యాక సందీప్ ఈ సినిమా నిర్మాణం గురించి ప్రకటిస్తాడట. మరి ఇప్పటివరకు కామెడీ చేసిన రాహుల్, ప్రియదర్శి హీరోలుగా ఫైట్స్ ఎలా చేస్తారో చూడాలి