Wed Dec 25 2024 18:26:00 GMT+0000 (Coordinated Universal Time)
Prudhvi Raj : స్టార్ హీరో కొడుకుతో.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూతురి పెళ్లి..!
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూతురు ఒక స్టార్ హీరో కొడుకుతో ఏడడుగులు వేయబోతున్నారా..? పృథ్వీరాజ్ ఏం చెప్పారు..?
Prudhvi Raj : సినీ నటుడు పృథ్వీరాజ్.. ఇండస్ట్రీలో ఎన్ని పాత్రలు చేసినా రాని ఫేమ్, '30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే ఒక్క డైలాగ్ తో వచ్చింది. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు చేసి తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకున్న పృథ్వీరాజ్.. మధ్యలో పాలిటిక్స్ వైపు అడుగులు వేసి బ్యాడ్ ఫేస్ ని చూశారు. అక్కడ ఎదురైన సంఘటనల నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.
అయితే ఈసారి నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధమవుతున్నారు. తన కూతురు శ్రీలుని హీరోయిన్ గా పరిచయం చేస్తూ పృథ్వి.. "కొత్త రంగుల ప్రపంచం" అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తాజాగా పృథ్వి, తన కూతురు శ్రీలుతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పృథ్వి కూతురు పెళ్లి గురించి కూడా ఆసక్తి చర్చ జరిగింది.
గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తుంది. ఒక స్టార్ హీరో కుమారుడితో పృథ్వీ కూతురి శ్రీలు ఏడడుగులు వేయబోతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆ హీరో కొడుకుతో ప్రేమలో ఉందని ఒక రూమర్ నడుస్తుంది. ఇక ఈ విషయం గురించే పృథ్విని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.. "ఏమో ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. భవిషత్తు మన చేతిలో లేదు కదా" అంటూ చెప్పుకొచ్చారు.
ఇక పృథ్వీ చేసిన వ్యాఖ్యలు.. స్టార్ హీరో కొడుకుతో పెళ్లి అనే రూమర్ కి ఇంకా బలం చేకూరిస్తున్నాయి. మరి శ్రీలు ప్రేమలో ఉన్న ఆ స్టార్ కిడ్ ఎవరో..? ఆమె ఎవరితో ఏడడుగులు వేయబోతుందో..? అని చర్చ మరింత పెరిగింది. కాగా పృథ్వీ ప్రస్తుతం సినిమాల్లో పని చేస్తూనే జనసేన పార్టీలో కూడా కార్యకర్తగా కొనసాగుతూ వస్తున్నారు.
Next Story