Mon Dec 23 2024 02:44:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఫొటో పెట్టి పెళ్లివిషయం చెప్పిన రాహుల్.. మండిపడుతున్న నెటిజన్లు !
‘ఇప్పుడు ముద్దులు పెట్టే ఫొటో పోస్ట్ చేశారు.. రేపు బెడ్ సీన్స్ పెడతారా?’’ ఏంటి అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. కొంచెం ఇమేజ్..
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఇటీవల సోషల్ మీడియాలో పలు పోస్టులు చేసి.. నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. గతంలో సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసిన రాహుల్.. ఆ మర్నాడే ఊరికే జోక్ చేశానని మరో ట్వీట్ చేయడంతో.. రాహుల్ పై నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా మరోసారి నెటిజన్లకు కోపం తెప్పించాడు ఈ కమెడియన్. ఒక ఫొటో పోస్ట్ చేసి తానొక అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు చెప్పాడు. ఇది మంచి విషయమే కదా.. నెటిజన్లకు కోపం ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు చిక్కు.
రాహుల్ మామూలుగా ఆ అమ్మాయితో ఉన్న ఫొటో పోస్ట్ చేస్తే బాగుండేది. కానీ.. పెళ్లాడబోయే అమ్మాయిని లిప్ లాక్ చేస్తున్న ఫొటో పెట్టడంతోనే.. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రాహుల్ చేసిందాట్లో తప్పేముందని సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇది పద్ధతి కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.
'ఇప్పుడు ముద్దులు పెట్టే ఫొటో పోస్ట్ చేశారు.. రేపు బెడ్ సీన్స్ పెడతారా?'' ఏంటి అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. కొంచెం ఇమేజ్ వస్తే చాలు ఇలా దిగజారిపోవడమేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''కంగ్రాట్స్ అన్నా. కానీ, ఇలా లిప్ లాక్ ఫొటో కాకుండా వేరే ఫొటో పెట్టి ఉంటే బాగుండేది. మీరు చేసిందేం బాగాలేదు. మీ కుటుంబానికి గౌరవం ఇవ్వలేదు'' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. నాలుగు గోడల మధ్య జరిగేది.. ఇలా పబ్లిక్ గా పోస్ట్ పెట్టి సమాజానికి చెప్పాలా? జనాలను సగం చెడగొడుతున్నది సినిమావాళ్లేనంటో.. మరో వ్యక్తి దుయ్యబట్టాడు. ఫేమస్ అయ్యేందుకు నీకు కాబోయే భార్యను కూడా చీప్ చేస్తావా? అంటూ మరో నెటిజన్ మండిపడ్డాడు.
Next Story