Mon Dec 23 2024 18:23:56 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత
గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు.
గత కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హాస్యనటుడు తుది శ్వాస విడిచారు. ఆగస్టు 10న రాజుకు గుండెపోటు రావడంతో ఎయిమ్స్లో చేర్చారు. రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యారు. "ఆయన తన రొటీన్ వ్యాయామం చేస్తున్నారు. ట్రెడ్మిల్పై ఉండగా, అకస్మాత్తుగా పడిపోయాడు. అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు," అని రాజు శ్రీవాస్తవ బంధువు గతంలో PTI కి చెప్పారు.
రాజు శ్రీవాస్తవ్ చక్కటి కామెడీ టైమింగ్ నిండిన జోకులతో కోట్లాది మంది మోముపై చిరునవ్వులు నింపేవాడు. స్టాండ్-అప్ కామెడీ ప్రపంచంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2005 సంవత్సరంలో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్' లో మంచి పేరు సంపాదించుకున్నారు. "మైనే ప్యార్ కియా", "బాజీగర్", "బాంబే టు గోవా" (రీమేక్).. వంటి హిందీ చిత్రాలలో కనిపించారు. "బిగ్ బాస్" సీజన్ త్రీలో కూడా కనిపించారు. ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా పనిచేశారు.
Next Story