Mon Dec 23 2024 15:48:41 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ లో విషాదం.. హాస్యనటుడు మృతి
ప్రముఖ హాస్య నటుడు సారధి మృతి చెందారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సారధి మృతితో టాలివుడ్ లో విషాదం నెలకొంది.
ప్రముఖ హాస్య నటుడు సారధి మృతి చెందారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సారధి మృతితో టాలివుడ్ లో విషాదం నెలకొంది. సారధి దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించారు. పాతతరం వారికి హాస్యనటుడిగా సారధి మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యంగా విఠలాచార్య దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో సారధికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. హీరో నరసింహరాజు సహచరుడిగా సారధి అందరినీ అలరించారు.
1990వ దశకం నుంచి....
1960లో సీతారామ కల్యాణంతో సారధి సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. 1990వ దశకం నుంచి సారధి పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలిరావడంతో సారధి ముఖ్య పాత్ర పోషించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. నాటకరంగం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన సారధి మృతి పట్ల పలు తెలుగు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Next Story