Mon Dec 23 2024 08:08:57 GMT+0000 (Coordinated Universal Time)
జైలర్ లో సునీల్ లుక్.. మళ్లీ అలాంటి పాత్రలో ?
తాజాగా జైలర్ నుండి సునీల్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. పుష్ప సినిమాలో.. సునీల్ "మంగళం శ్రీను" పాత్రలో నటించి..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా సినిమా జైలర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలర్ తో.. మరోసారి రజనీ తనదైన స్వాగ్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అనౌన్స్ చేసింది.
తాజాగా జైలర్ నుండి సునీల్ లుక్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. పుష్ప సినిమాలో.. సునీల్ "మంగళం శ్రీను" పాత్రలో నటించి.. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో సునీల్ కు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఏకంగా రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రావడం విశేషమే. ఈ సినిమాలోనూ సునీల్.. మంగళం శీను వంటి పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం. పోస్టర్ లుక్ కూడా ఇంచుమించుగా అలానే కనిపిస్తుంది. జైలర్ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Next Story