Mon Dec 23 2024 19:49:25 GMT+0000 (Coordinated Universal Time)
మూవీ టిక్కెట్ల పై నేడు కమిటీ
సినిమా టిక్కెట్ల అంశంపై నియమించిన కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూవీ ధరల అంశంపై చర్చించనున్నారు.
సినిమా టిక్కెట్ల అంశంపై నియమించిన కమిటీ నేడు సమావేశం కానుంది. ఈ సమావేశంలో మూవీ ధరల అంశంపై చర్చించనున్నారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మొత్తం 13 మంది సభ్యుల గల కమిటీ ఈ సమావేశంలో సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపు, థియేటర్లలో వసతులు, న్యాయస్థానం తీర్పు వంటి అంశాలను చర్చిస్తుంది.
ధరల తగ్గింపుపై.....
ఈ అంశాలపై చర్చించే కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఈరోజు ఇచ్చే అవకాశముంది. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల తగ్గించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. వారి వినతులను కూడా కమిటీ పరిశీలించనుంది.
Next Story