అల్లు అర్జున్ పై కేసు?
అల్లు అర్జున్ లాక్ డౌన్ లో ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ పుష్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేరళ అడవుల్లో కానీ, నల్లమల అడవుల్లో కానీ [more]
అల్లు అర్జున్ లాక్ డౌన్ లో ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ పుష్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేరళ అడవుల్లో కానీ, నల్లమల అడవుల్లో కానీ [more]
అల్లు అర్జున్ లాక్ డౌన్ లో ఇంట్లోనే వర్కౌట్స్ చేసుకుంటూ పుష్ప సినిమా షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాడు. కేరళ అడవుల్లో కానీ, నల్లమల అడవుల్లో కానీ ఈ సినిమా షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. కథ ప్రకారం ఈ సినిమా మొత్తం అడవుల చుట్టూనే తిరుగుతుంది. అయితే కరోనా కారణంగా దర్శకుడు సుకుమార్ – అల్లు అర్జున్ ప్లాన్స్ అన్ని బెడిసికొట్టాయి. ఇక కరోనా లాక్ డౌన్ లోను పుష్ప లుక్ నే మెయింటింగ్ చేస్తూ అందరిలా కాకుండా ఉదయం లేచి కేబీఆర్ పార్కు.. లేదంటే సిటీ ఔట్స్ కట్స్ కో వెళ్లి జాగింగ్ చేస్తున్న అల్లు అర్జున్ తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధి కుంటాల జలపాతాన్ని సందర్శించాడు. కరోనా కారణంగా పర్యకటక ప్రాంతాలన్నీ మూసివేయ్యగా అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ టీం తో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించడం చర్చనీయాంశమైంది.
పుష్ప లొకేషన్స్ సెర్చింగ్ లో భాగంగానే అల్లు అర్జున్ కుంటల జలపాతాన్ని అలాగే మహారాష్ట్రలోనూ తిప్పేశ్వర్ ని సందర్శించడంతో.. అల్లు అర్జున్ అండ్ పుష్ప టీం కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి.. ఇలా కుంటాల జలపాతంతో పాటుగా తిప్పేశ్వర్ ని సందర్శించి షూట్ చేసారంటూ.. సమాచార హక్కుల సాధన స్రవంతి ప్రతినిధులు అల్లు అర్జున్ పై పుష్ప టీం పై ఆదిలాబాద్ జిల్లా నేరెడికొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కోవిడ్ కారణంగా కుంటాల జలపాత సందర్శాన్ని నిలిపివేసిన అల్లు అర్జున్ తన టీం తో దానిని సందర్శించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్ జిల్లా డీఎఫ్ఓ అందుబాటులో లేకపోవడంతో.. అక్కడి పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి తమ ఫిర్యాదు పత్రాన్ని అందించి వెళ్లినట్టుగా తెలుస్తుంది.