'96' చుట్టూ వివాదం..!
తమిళంలో రీసెంట్ గా ఓ ప్రేమ కథా చిత్రం వచ్చి సూపర్ హిట్ అయింది. త్రిష - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో వచ్చిన '96' అనే లవ్ స్టోరీ కోలీవుడ్ లో ప్రేక్షకులని మెప్పించడమే కాదు.. క్రిటిక్స్ సైతం ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొన్నారు. ఇది ఇలా ఉండగా '96' చుట్టూ కాపీ వివాదం ముసురుకుంటోంది. ఈ మధ్యకాలంలో ఈ కాపీ గోల ఎక్కువ అయిపోయింది. సినిమా టీజర్ కానీ ట్రైలర్ కానీ రిలీజ్ అయినప్పుడు ఈ కథ నాదే అంటూ కొంతమంది రావడం.. లేదా సినిమా రిలీజ్ అయ్యాక ఈ కథ నాదే అంటూ వచ్చి కోర్టువరకూ వెళ్లటం జరుగుతుంది. కొన్ని కథలకు కోర్టులో పరిష్కారం దొరికితే.. కొన్నింటికి పెద్ద మనుషుల సమక్షంలో రాజీకి వచ్చేయడం జరుగుతోంది.
కథ నాదంటే నాదంటూ...
అయితే రీసెంట్ గా దీని గురించి దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ... ఈ సినిమా కథ నా అసిస్టెంట్ సురేశ్ రాసుకున్న కథ అని... మరుధ పాండియన్ అనే వ్యక్తి ద్వారా ప్రేమ్ కుమార్ కి ఈ కథ వెళ్లింది అని అన్నారు. గతంలో సురేశ్ కి స్నేహితుడిగా ఉన్న మరుధ పాండియన్ మోసం చేశాడు అన్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ...ఈ ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదు. అందరి జీవితాల్లో కామన్ గా జరిగే సంఘటనలతో ఈ కథను రూపొందించాను అని అన్నారు. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇలా కుట్ర చేస్తున్నారని.. నేను చట్టపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపాడు.