Mon Dec 23 2024 11:46:32 GMT+0000 (Coordinated Universal Time)
కంగనా అటూ.. ఇటూ.. ఎటూ కాకుండా పోయారా?
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా వేడి పుట్టిస్తూనే ఉన్నాయి.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా వేడి పుట్టిస్తూనే ఉన్నాయి. దేశ స్వాతంత్ర్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పు పడుతున్నారు. తాజాగా రైతు చట్టాలను ఉప సంహరించుకున్న కేంద్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్ చేసిన మరో హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కంగనా ఇటు అటు ఎటూ కాకుండా పోయారు. ఆమెను ద్వేషించే వారి సంఖ్య రోజురోజుకూ దేశంలో పెరుగుతూ ఉంది.
మరో కేసు....
తాజాగా కంగనా రనౌత్ పై మరో కేసు నమోదయింది. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ కంగనా రనౌత్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంగనా రనౌత్ తన ఇన్ స్టాగ్రామ్ లో సిక్కు సామాజికవర్గంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఉద్దేశ్యపూర్వకంగానే ఆమె చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story