Mon Dec 23 2024 03:34:19 GMT+0000 (Coordinated Universal Time)
వర్మకు చలిజ్వరం... అందుకేనట
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆయన కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తుంటారు. తాజాగా చలో విజయవాడ కార్యక్రమంపై రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆయన వరస ట్వీట్ లు చేశారు. ఇన్ని లక్షల మందిని విజయవాడ రోడ్లపై చూసి తనకు చలి జ్వరం వచ్చిందని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
సెటైరికల్ గానే....
ఇన్ని లక్షల మంది రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం తనకు షాక్ ఇచ్చిందని అన్నారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంత మంది ఉద్యోగులు రోడ్లపైకి వస్తారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికేమో గాని తనకయితే చలిజ్వరం వచ్చిందంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇంతకీ వర్మ ప్రభుత్వాన్ని తప్పుపట్టాడా? ఉద్యోగులపై సెటైర్ వేశాడా? అన్నది అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు.
Next Story