Mon Dec 23 2024 03:58:46 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్లుండి పేర్ని నానితో వర్మ భేటీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ నెల10వ తేదీన ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్నారు
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ నెల10వ తేదీన ఏపీ మంత్రి పేర్ని నానిని కలవనున్నారు. ఈ మేరకు టైం ఫిక్స్ అయినట్లు వర్మ తన ట్విట్టర్ లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో మూవీ టిక్కెట్ల వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. దీనిపై టాలీవుడ్ ప్రముఖులందరూ దాదాపు స్పందించారు. అదే సమయంలో రాంగోపాల్ వర్మ కూడా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.
టిక్కెట్ల ధరలపై.....
తాను మంత్రికి పూర్తి స్థాయిలో ఈ సమస్యపై వివరిస్తానని, మంత్రి అపాయింట్ మెంట్ కావాలని రాంగోపాల్ వర్మ కోరడంతో పేర్ని నాని ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నెల 10 తేదీన కలుద్దామని పేర్ని నాని చెప్పడంతో వర్మ టాలీవుడ్ సమ్యలపై చర్చించేందుకు సిద్ధమయ్యారు.
Next Story