Mon Dec 23 2024 04:08:23 GMT+0000 (Coordinated Universal Time)
వోడ్కా తాగుతూ వర్మ పేర్ని నానికి కౌంటర్
సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పై ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు పై ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. మంత్రి పేర్ని నాని సినిమా నచ్చకపోతే టిక్కెట్ ధర ను వెనక్కు ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఓడ్కా తాగుతూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. రాజమౌళి బాహుబలిని యాభై కోట్లతో తీస్తే, వర్మ ఐస్ క్రీమ్ సినిమాను ఐదు లక్షలతో తీస్తాడని, రెండింటికీ ఒకే రేటు అయితే ఎలా? అని వర్మ ప్రశ్నించారు.
ఓటేసిన వాడు...
పేదవారి కోసమే సినిమా రేట్లు తగ్గిస్తామని చెబుతున్న ప్రభుత్వం జగన్, పేర్ని నాని, కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్ లు కలసి రాజమౌళి కంటే మంచి సినిమా తీసి ప్రజలకు ఉచితంగా చూపించమని వర్మ సలహా ఇచ్చారు. కెపాసిటీ ఉన్న వాళ్ల ప్రతిభను తగ్గించాలనుకోవడం రెడిక్యులస్ అని వర్మ ఫైర్ అయ్యారు. ఒక హోటల్ కు వెళ్లి పీకలదాకా తిని టేస్ట్ నచ్చలేదని బిల్లు కట్టనంటే ఒప్పుకుంటారా? అని వర్మ ప్రశ్నించారు. తనకు వైసీపీ పాలన నచ్చలేదని ఓటేసిన వాడు అంటే మీరు ప్రభుత్వం నుంచి దిగిపోతారా? అని ప్రశ్నించారు.
Next Story