దాని కారణంగా అన్ని మారతాయ్!!
సినిమా ఇండస్ట్రీ విషయంలో కరొనకి ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కరొనకి ముందు నిర్మాతలంతా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గేవారు కాదు. కానీ ఇప్పుడు [more]
సినిమా ఇండస్ట్రీ విషయంలో కరొనకి ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కరొనకి ముందు నిర్మాతలంతా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గేవారు కాదు. కానీ ఇప్పుడు [more]
సినిమా ఇండస్ట్రీ విషయంలో కరొనకి ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. కరొనకి ముందు నిర్మాతలంతా బడ్జెట్ విషయంలో వెనక్కి తగ్గేవారు కాదు. కానీ ఇప్పుడు అలా స్పీడుగా ఖర్చు పెట్టె సీన్ లేదు. ఇక భారీ బడ్జెట్ ఏంటి చిన్న సినిమాల విషయంలో టెక్నీకల్ గా కూడా చాలా మార్పులొస్తాయ్. అంటే ఒక సినిమా తర్వాత మరో సినిమా చేద్దామనుకున్న సినెమాటోగ్రఫేర్స్ కానీ వేరే ఇతర టెక్నీకల్ డిపార్ట్మెంట్ కానీ.. ఒకేసారి రెండు సినిమాలు చెయ్యడం కుదిరేపని కాదు. అందుకే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో కీలక మార్పులు ఖాయం… ఇప్పటికే మహేష్ – పరశురామ్ ల సర్కారు వారి పాట విషయంలో ఆ కీలక మార్పు ఒకటి జరిగిపోయింది.
పరశురామ్ తో మహేష్ సర్కారు వారి పాట మొదలుపెట్టినప్పుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా టాప్ కెమెరామెన్ గా పి.ఎస్. వినోద్ ని ఎంపిక చేసారు. కానీ ఇప్పడు పి. ఎస్. వినోద్ సర్కారు వారి పాట నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వినోద్ కి వకీల్ సాబ్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. మరి మహేష్ సర్కారు వారి పాట – వకీల్ సాబ్ షూటింగ్ లు ఒకేసారి పట్టాలెక్కిస్తే అయనకి ఇబ్బంది అందుకే… సర్కారు వారి పాట నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి మది వచ్చేసాడు. మరి లెక్క ప్రకారం వకీల్ సాబ్ మార్చి లోనే పూర్తి కావాల్సింది. అందుకే వినోద్ సర్కారు వారి పాట కి పని చెయ్యడానికి ఒప్పుకున్నాడు. కానీ కరోనా వలన వకీల్ సాబ్ షూట్ లేట్ అవడంతో.. వినోద్ ఇప్పడు సర్కారు వారి పాటకి బై చెప్పాల్సి వచ్చింది. మరి కరోనా కారణంగా అన్నీ తారుమారవడంతో ఇలాంటి కీలక మార్పులు భారీ బడ్జెట్ సినిమాల్లో అనివార్యమయ్యేలా కనబడుతున్నాయి.