‘2.o’ క్లైమాక్స్ అయిపోగానే వెళ్లిపోకండి..!
2.oలో ఒక పాట కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు చేయించాడు డైరెక్టర్ శంకర్. అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా రాజీ పడని శంకర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సాంగ్ కోసం 4 భారీ సెట్స్ వేయించి...రజినీ - అమీ జాక్సన్ పై నాలుగు రోజుల పాటు షూట్ చేసి అందులో గ్రాఫిక్స్ పెట్టి చూపించాడు శంకర్. అయితే సినిమా మధ్యలో ఈ సాంగ్ వచ్చి ఉంటే బాగుండేది కానీ సినిమా మొత్తం కంప్లీట్ అయిన తరువాత రోలింగ్ టైటిల్స్ లో వస్తుంది.
క్లైమాక్స్ అయిపోయాక...
సాధారణంగా మన వాళ్లకి క్లైమాక్స్ అర్ధం అయిపోతే సీట్ లో ఒక నిమిషం కూడా కూర్చోకుండా ఏదో పని ఉన్నట్టు లేచి వెళ్లిపోతుంటారు. అలానే ఈ సినిమా క్లైమాక్స్ లో కథ మొత్తం సుఖాంతంగా ముగిసిందని తేలిన వెంటనే అంతా లేచి వెళ్లిపోవడం స్టార్ట్ చేశారు. కరెక్ట్ గా ఆ టైంకి ఈ కాస్ట్లీ సాంగ్ పెట్టాడు శంకర్. యంత్రలోకపు సుందరివే అని స్టార్ట్ అయ్యే ఈ సాంగ్ తెరపై మూడొంతులు మాత్రమే పాట కనిపిస్తుంది. కింద టైటిల్స్ పడుతుంటాయి. దాంతో అంత సినిమా అయిపోయిందని అర్ధం చేసుకుని వెళ్లిపోయారు.
20 కోట్లు వృధానేనా..?
ఈ సాంగ్ పూర్తైన తరువాత ఒక సీన్ కూడా పెట్టాడు. అలా 20 కోట్ల పాట 2.o సినిమాలో వృధా చేసాడు శంకర్. అయితే శంకర్ ఇలా చేసినందుకు మెచ్చుకోవాలి. ఆ పాట సినిమా మధ్యలో వస్తే ప్రేక్షకులు ఇబ్బంది పడేవారు. కానీ ఆలా ఇరికించాలనే ఆలోచన పెట్టుకోకుండా, కేవలం కథ-స్క్రీన్ ప్లేకు కట్టుబడి లాస్ట్ లో పెట్టాలి డిసైడ్ అవ్వడంతో మంచి పని చేసాడు అని పొగుడుతున్నారు.