Mon Dec 23 2024 01:27:30 GMT+0000 (Coordinated Universal Time)
రేపే సలార్ టీజర్.. కౌంట్ డౌన్ స్టార్ట్
పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ హీరోతో తీస్తున్న సలార్ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాబోతున్న..
బాహుబలి తో గ్లోబల్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్.. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో నటిస్తోన్న సినిమా సలార్. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ తర్వాత.. వస్తున్న ఈ సినిమా ను కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మరికొన్ని గంటల్లో టీజర్ విడుదల కాబోతోంది. రేపు(జులై6) ఉదయం 5.12 గంటలకు సలార్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించగా.. టీజర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 90 సెకన్ల నిడివితో టీజర్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెట్టింట వైరల్ అవుతున్న ఓ అప్డేట్ టీజర్ పై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసింది.
ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ రెండు పార్టులు ఏ స్థాయిలో రికార్డులు సృష్టించాయో చెప్పనక్కర్లేదు. ఇక బాహుబలి విషయానికొస్తే.. అది జక్కన్న సృష్టించిన అద్భుత చిత్రమనే చెప్పాలి. దాంతో పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా స్టార్ హీరోతో తీస్తున్న సలార్ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాబోతున్న సలార్ సినిమా టీజర్ కేజీఎఫ్ + బాహుబలిలా ఉండబోతోందని ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కడెల్ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సలార్ లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుండగా.. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ ను గ్రాండ్ విడుదల చేసేందుకు హోంబలే ఫిలిమ్స్ సిద్ధమవుతోంది. సలార్ రెండుపార్టులుగా రాబోతుండగా.. తర్వాతి సీక్వెల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సలార్ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె, మారుతి డైరెక్షన్ లో రాజా డీలక్స్ చిత్రాలను ప్రభాస్ లైన్లో పెట్టాడు.
Next Story