Thu Dec 19 2024 17:15:15 GMT+0000 (Coordinated Universal Time)
పుష్ప-2 నుంచి క్రేజీ అప్డేట్.. ప్రతీకారం మామూలుగా ఉండదట
పుష్ప సినిమాలో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. క్లైమాక్స్ లో పుష్ప భన్వర్..
పుష్ప.. ఈ సినిమాతో అల్లుఅర్జున్ స్టార్ డమ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టైలిష్ స్టార్ కాస్తా.. ఐకాన్ స్టార్ అయ్యాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో తీసిన సినిమాలో స్మగ్లర్ ను హీరోగా చూపించడంపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా.. అల్లు అర్జున్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు బన్నీ అభిమానులంతా పుష్ప-2 కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కుతోన్న పుష్ప-2 నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
పుష్ప సినిమాలో ఫహద్ ఫాసిల్ భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. క్లైమాక్స్ లో పుష్ప భన్వర్ సింగ్ కు ఇచ్చిన ఝలక్ కి.. పార్ట్ 2 లో ప్రతీకారం తీర్చుకునేందుకు భన్వర్ సింగ్ వస్తాడట. పుష్ప-2 లో ఎక్కువ సన్నివేశాలు పుష్ప- భన్వర్ ల మధ్యనే ఉంటాయని తెలుస్తోంది. కాగా.. పుష్ప-2లో భన్వర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తైనట్లు డైరెక్టర్ సుకుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లొకేషన్ నుండి ఒక ఫొటో షేర్ చేశారు. పార్ట్ 1 లో పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో చూశాం. అలాగే పుష్ప-2 లో కూడా అలాంటి డైలాగ్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story