క్రికెటర్ తో షారూఖ్ కూతురి ప్రేమాయణం..
ఇప్పుడు బాలీవుడ్ లో తారల పిల్లలు వెండితెర మీద వెలిగిపోవాలని.. అక్కడ హీరోయిన్స్ గా చక్రం తిప్పాలని చూస్తున్నారు. బాలీవుడ్ టాప్ నటుల కూతుళ్లు ఇప్పుడు వెండితెర అరంగేట్రానికి సన్నద్ధం అవుతున్నారు. అప్పుడే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ వెండితెర అరంగేట్రం మూవీ ధఢక్ వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతుంది. మరోపక్క సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తుంది. అలాగే అమీర్ ఖాన్ కూతురు కూడా సినిమాల్లోకొచ్చే ఛాన్సులు ఎక్కువగా వున్నాయి. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఈమధ్యన వెండితెర అరంగేట్రం చేస్తుంది అంటూ వార్తలొచ్చాయి.
మరీ పద్దెనమిదేళ్లకేనా..
కానీ ఇప్పుడు వెండితెర అరంగేట్రం అటుంచి పెళ్ళికి సిద్దమయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండ్రి షారుఖ్ ఖాన్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలలో తిలకించిన సుహానా ఖాన్ ఇప్పుడు యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెటర్ శుభ్ మాన్ గిల్ తోకలిసి సుహానా పబ్ లు, రెస్టారెంట్స్, డిన్నర్ లు, పార్టీలు అంటూ తిరుగుతుందని బాలీవుడ్ వర్గాల భోగట్టా. మరి బాలీవుడ్ వారసులంతా సినిమాల మీద మోజుతో పడి చస్తుంటే.. సుహానా 18 ఏళ్లకే ఇలా ప్రేమంటూ కెరీర్ ని ఇబ్బందుల్లో పెట్టుకోవడమేమిటంటూ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలాడుకుంటున్నారు.
ఇది కొత్తేమీ కాదుగా...
మరి సుహానా ప్రేమకు షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం సుహానా - క్రికెటర్ శుభ్ మాన్ గిల్ ల ప్రేమ వ్యవహారం మాత్రం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అయితే బాలీవుడ్ హీరోయిన్స్ కి క్రికెటర్స్ తో ప్రేమ కొత్తేమి కాదు. విరాట్ ని ప్రేమించి పెళ్లాడింది అనుష్క శర్మ... అలాగే చాలామంది క్రికెటర్స్ హీరోయిన్స్ ప్రేమలో ఉంటారు. కానీ ఇక్కడ సుహానా మరీ చిన్న పిల్ల. అందుకే అంత ఇదిగా చెవులు కొరుక్కుంటున్నారు బాలీవుడ్ జనాలు.