Mon Dec 23 2024 06:25:02 GMT+0000 (Coordinated Universal Time)
Mahesh Babu : మహేష్ బాబు కూతురు సితార.. పేరుతో మోసాలు..
మహేష్ బాబు కూతురు సితార పేరుతో అభిమానులను మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లు. అసలు ఏమైందంటే..?
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.. చిన్న వయసులోనే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. తండ్రి పాటలకు డాన్స్ వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసే సితార.. కమర్షియల్ యాడ్స్, సమాజ సేవలు చేస్తూ సూపర్ పాపులారిటీనే అందుకున్నారు. అయితే ఇప్పుడు కొందరు సైబర్ నేరగాళ్లు.. ఈ పాపులారిటీని తప్పుగా ఉపయోగించుకొని, అమాయకులను మోసం చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ లో సితార పేరుతో ఉన్న ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ని మహేష్ బాబు అభిమానులకు సెండ్ చేస్తూ.. సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇక ఈ ఫేక్ ట్రేడింగ్ లింక్స్ ద్వారా అభిమానుల నుంచి నగదుని కాజేస్తున్నారు. ఇలా సితార పేరుతో చాలామందినే మోసం చేశారట. ఇక ఈ విషయం కాస్త, మహేష్ బాబు దృష్టికి వెళ్లడంతో.. వారు వెంటనే అలెర్ట్ అయ్యి సైబరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి తెలియజేసారు.
మహేష్ బాబు టీం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేటుగాళ్లు కోసం దర్యాప్తు మొదలుపెట్టారు. త్వరలోనే ఆ నేరస్తులను పట్టుకుంటామని తెలియజేసారు. ఇక ఈ మోసాలు నుంచి జాగ్రత్తగా ఉండాలని మహేష్ బాబు టీం అభిమానులను హెచ్చరించింది. కాగా ఇటీవల టాలీవుడ్ డాన్స్ మాస్టర్ 'శేఖర్' కూతురు పేరుతో కూడా ఇలాంటి మోసానికే పాల్పడితే.. శేఖర్ మాస్టర్ కూడా వెంటనే అలెర్ట్ అయ్యి పోలిసుల దృష్టికి తీసుకు వెళ్లారు.
Next Story