పవన్ కోసం నిర్మాతలు కష్టాలు!
పవన్ కళ్యాణ్ కోసం పర్సనల్ ట్రైనర్అటు ఏపీ పంచాయితీ ఎలక్షన్స్ హడావుడిని, ఇటు సినిమాల షూటింగ్స్ ని బాగానే మ్యానేజ్ చేస్తూ నెట్టుకొస్తున్న పవన్ కళ్యాణ్ తన [more]
పవన్ కళ్యాణ్ కోసం పర్సనల్ ట్రైనర్అటు ఏపీ పంచాయితీ ఎలక్షన్స్ హడావుడిని, ఇటు సినిమాల షూటింగ్స్ ని బాగానే మ్యానేజ్ చేస్తూ నెట్టుకొస్తున్న పవన్ కళ్యాణ్ తన [more]
పవన్ కళ్యాణ్ కోసం పర్సనల్ ట్రైనర్
అటు ఏపీ పంచాయితీ ఎలక్షన్స్ హడావుడిని, ఇటు సినిమాల షూటింగ్స్ ని బాగానే మ్యానేజ్ చేస్తూ నెట్టుకొస్తున్న పవన్ కళ్యాణ్ తన ఫిజికల్ ఫిట్ నెస్ విషయంలో మాత్రం పూర్తిగా అశ్రద్ధ వహించేస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కంప్లైంట్. గతంలో అయితే కాస్త జిమ్ కెళ్ళి వర్కౌట్స్ అవి చేసి.. ఫిట్ గా ఉండేవారు పవన్. కానీ ఈ మధ్యన పవన్ కి సమయం దొరక్క.. అటు రాజకీయాలు, ఇటు సినిమాలంటూ తపనపడుతున్న పవన్ ఫిజిక్ విషయంలో మాత్రం బాగా నెగ్లెట్ చేసారు. అయితే ఇప్పుడు మాత్రం క్రిష్ సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ కోసం పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ బోడి షేప్ అవసరం కాబట్టి.. పవన్ కళ్యాణ్ కంపల్సరీ జిమ్ చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది.
మరి రాజకీయాలు, సినిమాలంటూ బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం బెంగుళూరు నుండి ఒక ఫిజికల్ ట్రైనర్ ని దింపుతున్నారు. ఇక మీదట 24 గంటలు ఆ ఫిజికల్ ట్రైనర్ పవన్ కళ్యాణ్ తో ఉండి.. అంటే పవన్ షూటింగ్స్ తో హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో, రాజకీయాలంటూ ఏపీకి వెళితే ఏపీకి అన్నమాట. మరా ట్రైనర్ పవన్ కళ్యాణ్ ని ఫేస్ లో గ్లో నే కాదు.. బోడి లో కూడా పర్ఫెక్ట్ షేప్ ని చూపించబోతాడు మనకి. ఇక మీదట పవర్ స్టార్ ని నిజంగానే మనం పవర్ ఫుల్ గా చూస్తాం.
- Tags
- pawan kalyan