Mon Dec 23 2024 18:41:21 GMT+0000 (Coordinated Universal Time)
దీపికా, రణ్వీర్ సింగ్ జీవితాల్లో మరో గుడ్ న్యూస్
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఫిబ్రవరి 2024లో దీపికా పదుకోన్ గర్భం దాల్చినట్లు ప్రకటించారు. దీపిక తన రెండవ త్రైమాసికంలో ఉన్నట్లు చెప్పబడింది. ఈ స్టార్ జంట 2018లో వివాహం చేసుకున్నారు. ఆమె డెలివరీ సెప్టెంబర్ 2024లో జరగనుంది.దీపిక, రణవీర్ చేసిన పోస్ట్‌లో "సెప్టెంబర్ 2024" అని పిల్లల బట్టలు, పిల్లల బూట్లు, బెలూన్ లు ఉన్నాయి. దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు గత కొద్దిరోజులుగా టాక్ వినిపించింది. ఇటీవల బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొణె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత దీపికా వదులుగా ఉండే ఔట్ఫిట్లో కనిపించింది. దీపిక ప్రెగ్నెన్నీతో ఉందని పలు మీడియా సంస్థలు కూడా తెలిపాయి.
దీపిక.. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ని 2018లో పెళ్లి చేసుకుంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన 'గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా' సెట్స్‌లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కలుసుకున్నారు. నవంబర్ 2018లో పెళ్లి చేసుకునే ముందు వారు ఐదేళ్ల పాటు డేటింగ్ చేశారు. దీపిక చివరిగా హృతిక్ రోషన్ 'ఫైటర్' లో కనిపించింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సింగం ఎగైన్'లో కనిపించనుంది.
Next Story