Mon Dec 23 2024 11:57:55 GMT+0000 (Coordinated Universal Time)
Deepika-Ranveer : తల్లిదండ్రులు కాబోతున్న దీపికా రణ్వీర్..
తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన దీపికా పడుకోణె, రణ్వీర్ సింగ్. ఈ ఏడాది సెప్టెంబర్‌లో..
Deepika Padukone - Ranveer Singh : బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పడుకోణె, రణ్వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2018 నవంబర్ 14న ఈ ఇద్దరు ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం ఇద్దరు తమ తమ కెరీర్స్ పై ఫోకస్ పెట్టి ముందుకు సాగుతూ వచ్చారు. అయితే వీరి అభిమానులంతా.. దీప్‌వీర్ వారసులు కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవల దీపికా ప్రెగ్నెంట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి.
ఆ వార్త నిజం కావాలని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశ పడ్డారు. ఇప్పుడు ఆ ఆశ నిజమైంది. తమ మొదటి బేబీకి ఆహ్వానం పలుకుతున్నట్లు దీపికా పడుకోణె, రణ్వీర్ సింగ్ తెలియజేసారు. తమ ఇన్స్టాగ్రామ్ లో ఒక గ్రీటింగ్ నోట్ పోస్ట్ చేశారు. ఆ పోస్టులో బేబీకి సంబంధించిన డ్రెస్సులు కనిపిస్తున్నాయి. అలాగే 'సెప్టెంబర్ 2024' అని రాసి ఉంది. ఇది చూస్తుంటే.. సెప్టెంబర్ లో దీపికాకి డెలివరీ అవుతుందని తెలుస్తుంది.
ఈ పోస్టు చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తమ సంతోషం వ్యక్తం చేస్తూ.. దీపికా రణ్వీర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, దీపికా ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాలో నటిస్తున్నారు. మేలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ పోస్టు చూస్తుంటే.. కల్కిలో దీపికాకి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.
Next Story