Mon Dec 23 2024 12:13:13 GMT+0000 (Coordinated Universal Time)
తన సోల్ తో డ్యాన్స్ చేసిన దీప్తి సునయన.. నెట్టింట్లో వీడియో వైరల్
తాను చేసే ఈవెంట్స్, అప్ కమింగ్ ప్రాజెక్టులు, ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలింస్ గురించిన అప్డేట్స్ ను తన ఇన్ స్టా హ్యాండిల్ లో
పాపులర్ యూ ట్యూబర్, తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ దీప్తి సునయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాను చేసే ఈవెంట్స్, అప్ కమింగ్ ప్రాజెక్టులు, ప్రైవేట్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలింస్ గురించిన అప్డేట్స్ ను తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్టు చేస్తుంటుంది. అలాగే అప్పుడప్పుడు ఫోటో షూట్ లను కూడా పోస్ట్ చేస్తుంది. దీప్తికి ఇన్ స్టా లో మూడున్నర మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే.. ఈ అమ్మడికి నెటిజన్లలో ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతుంది. తాజాగా దీప్తి ఓ వీడియోను తన అభిమానులతో పంచుకుంది.
ఆ వీడియోలో దీప్తి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. ధనుష్ హీరోగా నటించిన తిరు సినిమా ఇటీవలే విడుదలైంది. ఆ సినిమాలోని ఓ పాటకు దీప్తి డ్యాన్స్ చేస్తుంది. వింతేంటంటే.. దీప్తి తన సోల్ తో డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఆ వీడియో క్రియేట్ చేసింది. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. Vibing with my own soul అని రాసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. నీకు నీ సోలే బెస్ట్ సోల్ మేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Next Story