Sun Dec 29 2024 11:53:03 GMT+0000 (Coordinated Universal Time)
జీవిత, రాజశేఖర్ లకు జైలు శిక్ష
దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాల
పరువు నష్టం కేసులో ప్రముఖ సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించింది. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని 2011లో జీవిత, రాజశేఖర్ ఆరోపించారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.
జీవిత, రాజశేఖర్ దంపతులు పొలిటికల్ గా అప్పట్లో చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో చిరంజీవి మీద విమర్శలు చేసే సమయంలో తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సేవ చేయడం కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకు మీద తీవ్ర విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఈ ఆరోపణలు అవాస్తవమని అప్పట్లో అల్లు అరవింద్ కూడా ఖండించారు. వారు చేసిన ఆరోపణలను తేలికగా వదలమని.. తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. అలా సుదీర్ఘంగా విచారణ జరిగాక జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
Next Story