Mon Dec 23 2024 08:29:06 GMT+0000 (Coordinated Universal Time)
ఆదిపురుష్ పై పిటిషన్.. ప్రభాస్ కు హైకోర్టు నోటీసులు
ఆదిపురుష్ టీజర్ పై పలు వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. 'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మనోభావాలను..
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆదిపురుష్. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అవ్వగా.. దానిపై పెద్ద రచ్చే జరుగుతోంది. ప్రభాస్ ను కార్టూన్ తో మేనేజ్ చేసి చూపించారన్న కామెంట్లు, రాముడు ఆదిపురుష్ ఎలా అవుతాడని మరో వాదన ఉంది. దాంతో టీజర్ ను మరోమారు థియేటర్లో వేసి చూపించారు. టీజర్ వరకూ ఓకే.. మరి రావణుడి పాత్ర, వేషధారణపై వస్తున్న విమర్శల గురించి మాత్రం చిత్రయూనిట్ ఏమీ మాట్లాడట్లేదు.
ఆదిపురుష్ టీజర్ పై పలు వర్గాల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. 'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. 'ఆదిపురుష్' సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా సదరు సంస్థ కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు హీరో ప్రభాస్‌కు నోటీసులు జారీ చేసింది. ప్రభాస్‌తో పాటు 'ఆదిపురుష్' చిత్ర యూనిట్‌కు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
Next Story