Mon Dec 23 2024 08:15:54 GMT+0000 (Coordinated Universal Time)
18 పైరసీ సైట్లను నిషేధించాలి : ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్ర మరో రెండ్రోజుల్లా విడుదల కాబోతోంది. అయితే..
ఈ రోజు విడుదలైన సినిమా చూడటానికి థియేటర్ల వరకూ వెళ్లేవారు చాలా తక్కువ. అందుకు కారణం పైరసీ. సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే అది పైరసీ అయిపోతుంది. ఫ్రీ గా వైబ్ సైట్లలో చూసేందుకు అందుబాటులోకి వచ్చేస్తోంది. చిన్న సినిమాల సంగతి పక్కనపెడితే.. భారీ బడ్జెట్ సినిమాలు పైరసీ వెబ్ సైట్ల కారణంగా భారీగా నష్టపోతున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు వచ్చాక.. పైరసీ సైట్లు మరిన్ని ఎక్కువయ్యాయి. ఇప్పటికే అనేక సమస్యలు, ఫ్లాప్స్, బాయ్ కాట్ బాలీవుడ్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కి ఇప్పుడు పైరసీ మరో పెద్ద సమస్యగా తయారైంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్ర మరో రెండ్రోజుల్లా విడుదల కాబోతోంది. అయితే సినిమా రిలీజ్ కి ముందే కొన్ని పైరసీ సైట్స్ లో బ్రహ్మాస్త్ర సినిమా వచ్చేసింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ పైరసీ సైట్లతో తీవ్రంగా నష్టపోతున్నామని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన జస్టిస్ జ్యోతిసింగ్ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 18 వెబ్సైట్లను ముద్దాయిలుగా చేర్చుతూ పైరసీని ప్రోత్సహించే ఇలాంటి వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.
కాపీరైట్ ఉన్న కంటెంట్ని ప్రదర్శించినా, అందుబాటులో ఉంచినా, డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పించినా, షేరింగ్కి అనుమతించినా, అప్లోడ్ సదుపాయం ఉన్నా అది చట్టాన్ని ఉల్లంఘించడమే అని పేర్కొంటూ..అలాంటి వెబ్ సైట్లను నిషేధించాలంది. అలాగే పైరసీ వెబ్ సైట్లకు ఇంటర్నెట్ ప్రొవైడర్లు కూడా సేవలు నిలిపివేయాలని, పైరసీ వెబ్ సైట్లపై కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
Next Story