Mon Dec 23 2024 16:13:40 GMT+0000 (Coordinated Universal Time)
స్కూల్ టైంలోనే జాన్వీ కపూర్ ఫోటోలు అడల్ట్ సైట్లో..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ స్కూల్ లో చదువుకుంటున్న సమయంలోనే అడల్ట్ సైట్లో..
అతిలోక సుందరి 'శ్రీదేవి' వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన భామ 'జాన్వీ కపూర్' (Janhvi Kapoor). 21 ఏళ్ళ వయసులో బాలీవుడ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2018లో తెరకెక్కిన 'ధడక్' అనే సినిమాతో ఆడియన్స్ కి పరిచయమైంది. అప్పటి నుంచి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. కాగా సినీ పరిశ్రమలో పని చేస్తున్న హీరోయిన్స్ ఫోటోలను మార్ఫింగ్ చేసి పలు అశ్లీల వెబ్సైట్లలో పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.
అయితే జాన్వీ కపూర్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం కంటే ముందే.. తన ఫోటోలు అడల్ట్ సైట్లో దర్శనమిచ్చాయి. జాన్వీ స్కూల్ లో చదువుకుంటున్న సమయంలో ఈ విషయం జరిగిందట. ఈ విషయాన్ని తనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తాను టీనేజ్ లో ఉన్న సమయంలో తన ఫోటోలను ఎవరో మార్ఫింగ్ చేసి అడల్ట్ సైట్లో అప్లోడ్ చేశారట. అవి చూసి జాన్వీ చాలా షాక్ కి గురైనట్లు పేర్కొంది
ఇక ఆ ఫోటోలను చూసిన తన తోటి విద్యార్థులు తనపై జోక్స్ వేసినట్లు చెప్పుకొచ్చింది. "స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావు..? ఇండస్ట్రీలో ఫేమ్ సంపాదించుకోవడానికి ఇక కష్టపడాల్సిన అవసరం లేదు. అందరికి ఇప్పుడే తెలిసిపోయావు" అని హేళనగా కామెంట్స్ చేసేవారట. వారి మాటలకు తను ఎంతో బాధపడినట్లు జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా జాన్వీ త్వరలో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర' (Devara) సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం జాన్వీ చేతులో ఉన్న పెద్ద ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. ఈ భామ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో ఈ మూవీతో ఒక పాన్ ఇండియా హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ హోదా అందుకోవాలని చూస్తుంది. కాగా టాలీవుడ్ నుంచి ఈ భామ వద్దకి మరికొన్ని ఆఫర్లు కూడా వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Next Story