Mon Dec 23 2024 10:34:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకోసారి 'దేవర' అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్.. స్పెషల్ ఏమిటంటే?
దేవర అంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మొదటి వారం మంచి కలెక్షన్స్ సాధించింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ఎంటర్టైనర్ తెలుగు, హిందీ ప్రేక్షకులను అలరించడంలో విజయం సాధించింది. హిందీ వెర్షన్ ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల గ్రాస్ మార్క్ ను సాధించిన దేవర సినిమా దసరా సెలవుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి గ్రోత్ ను సొంతం చేసుకోనుంది.
ఇక ఈ సినిమాను చూడడానికి ఎన్టీఆర్ అభిమానులు మరోసారి ఎగబడుతూ ఉన్నారు. అందుకు కారణం సినిమాలో దావూదీ సాంగ్ ను చూపించడమే. సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. చిత్రం నిడివి ఎక్కువ కావడంతో పాటు సరైన ప్లేస్మెంట్ దొరకకపోవడంతో 'దావూదీ'ని మేకర్స్ ఆఖరి నిమిషంలో మూవీ నుంచి తొలగించారు. ఇవాళ్టి నుంచి ఈ పాటను తిరిగి యాడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అటు డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ యజమానులకు మంచి లాభాలను అందిస్తోంది.
Next Story