Mon Dec 23 2024 10:44:13 GMT+0000 (Coordinated Universal Time)
Devara: దేవర వచ్చేస్తున్నాడు.. భారీగా ప్లాన్ చేశారుగా
నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు ఎంతగానో
నందమూరి అభిమానులు మాత్రమే కాదు.. సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించిన 'దేవర' సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ భైరాగా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఉన్నారు.
దేవర సినిమాకు సంబంధించి ఈ రోజు మేకర్స్ ఓ పోస్టర్ను వదిలారు. ఎన్టీఆర్ అద్భుతమైన లుక్ లో.. పడవపై నిలబడి కనిపించాడు. దేవర గ్లింప్స్ జనవరి 8, 2024న విడుదలవుతాయని టీమ్ ప్రకటించింది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన విజువల్ ట్రీట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం ఉగాది పండుగ సందర్భంగా ఏప్రిల్ 5న విడుదల కానుంది. స్టంట్స్, VFX కోసం అత్యంత ప్రసిద్ధ హాలీవుడ్ టెక్నీషియన్ లు పని చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ప్రాజెక్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి.
Next Story