Mon Dec 23 2024 03:17:02 GMT+0000 (Coordinated Universal Time)
NTR : టైగర్ 3లో ఎన్టీఆర్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్.. ఊరమస్ అంతే..
టైగర్ 3లో ఎన్టీఆర్ పాత్రకి ఇచ్చిన ఎలివేషన్ ఊరమస్ ఉంది. అతడు మరణం కన్నా భయంకరమైన వ్యక్తి..
NTR : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' సినిమాలో కూడా కనిపించబోతున్నారు. ఈ మూవీలో హృతిక్ ని ఢీ కొట్టే పాత్రలో విలన్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమా యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ లో భాగంగానే షారుఖ్ ఖాన్ 'పఠాన్', సల్మాన్ ఖాన్ 'టైగర్' సిరీస్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
కాగా ఈ ఏడాది రిలీజ్ అయిన పఠాన్ సినిమాలో టైగర్‌గా సల్మాన్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టారు. ఇక సల్మాన్ టైగర్ 3లో 'పఠాన్'గా షారుఖ్, 'మేజర్ కబీర్ ధలీవాల్'గా హృతిక్‌తో పాటు ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఉంటుంది అంటూ కొన్నిరోజులు నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నేడు దీపావళి కానుకగా టైగర్ 3 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో షారుఖ్, హృతిక్ స్పెషల్ ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ విషయానికి వస్తే.. ఈ మూవీలో ఆయన కనిపించకపోయినా ఆయన పాత్ర గురించి వినిపించింది.
హృతిక్ ఎంట్రీ సమయంలో ఒక ఆఫీసర్ ఒక భయంకరమైన విలన్ గురించి చెబుతూ ఉంటాడు. ఆ విలన్ ఎన్టీఆర్ అని చెబుతున్నారు. "మనకి ఇప్పుడు ఒక కొత్త శత్రువు వచ్చాడు. అతను భయానికి భయం కలిగించేవాడు. అతనికి పేరు లేదు, మొఖం లేదు. చీకటిలోనే ఉంటాడు. అతడు మరణం కన్నా భయంకరమైన వ్యక్తి. అతడితో పోరాడితే నువ్వు కూడా సైతాన్‌వి అయ్యిపోతావేమో" అని హృతిక్‌కి ఎన్టీఆర్ గురించి చెబుతూ గూస్బంప్స్ ఎలివేషన్ ఇచ్చారు.
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో వార్ 2 పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. అటు దేవరలో కూడా ఎన్టీఆర్ పాత్ర చాలా క్రూరంగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తన తదుపరి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని గట్టిగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
Next Story