Mon Dec 23 2024 10:16:59 GMT+0000 (Coordinated Universal Time)
గోవా వెళ్ళబోతున్న ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా..?
'దేవర' సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొన్ని రోజుల్లో గోవా వెళ్లబోతున్నాడు. ఎందుకో తెలుసా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవర' సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక షెడ్యూల్ పూర్తి అవ్వగానే మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసి పట్టాలు ఎక్కించేస్తున్నాడు. ఇక ఈ మూవీ తరువాత వార్ 2, NTR30 సినిమాలు కూడా చేయాల్సి ఉంది. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ మొదలైంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లేని సన్నివేశాలను స్పెయిన్ లో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే, కొన్ని రోజుల్లో ఎన్టీఆర్ గోవా వెళ్లబోతున్నాడు. ఎందుకో తెలుసా..?
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ.. ఇప్పటివరకు దాదాపు యాక్షన్ షెడ్యూల్స్ నే జరుపుకుంటూనే వచ్చింది. ఇప్పుడు హీరోహీరోయిన్స్ మధ్య సన్నివేశాలను తెరకెక్కించడానికి మూవీ టీం సిద్దమవుతుంది. ఇక ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేశారట. ఇందుకోసమే ఎన్టీఆర్, జాన్వీ అండ్ మూవీ టీం త్వరలో గోవా ప్రయాణం అవ్వబోతున్నారు. జాన్వీ ఈ షెడ్యూల్ తోనే దేవర సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు ఇటీవల కొరటాల శివ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాలోని ప్రతి పాత్ర యొక్క ఎమోషన్ ని చాలా లోతుగా చూపించాల్సి వస్తుందని, దీంతో సినిమా నిడివి పెరుగుతుందని, అందుకే రెండు భాగాలుగా మూవీని తెరకెక్కించాల్సి వస్తుందని దర్శకుడు పేర్కొన్నాడు. ఇక మొదటి భాగాన్ని ముందుగా చెప్పినట్లు 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నారు.
నందమూరి కళ్యాణ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మిక్కిలినేని సుధాకర్ సహా నిర్మాతగా వ్యవరిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. మలయాళ యాక్టర్ షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.
Next Story