Mon Dec 23 2024 15:16:08 GMT+0000 (Coordinated Universal Time)
NTR : టీనేజ్లో ఎన్టీఆర్, శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేశాడట..
చిన్నపిల్లాడిలా అల్లరి చేసే ఎన్టీఆర్.. టీనేజ్లో హీరో శ్రీకాంత్ కొడుకుని కిడ్నాప్ చేశాడట. ఇంటిలో పిల్లోడు కనిపించక..
వచ్చేవారటNTR : సినిమాల్లో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎంత ఇంటెన్సిటీతో ఉంటుందో.. ఆఫ్ స్క్రీన్ తారక్ చేసే అల్లరి కూడా అంతే ఇంటెన్సిటీతో ఉంటుంది. ఎన్టీఆర్ సినిమాలు చూసిన వారంతా తన యాక్టింగ్ గురించి ఎలా మాట్లాడుతారో.. తనతో కలిసి పని చేసినవారు, తనతో స్నేహం చేసేవారు ఎన్టీఆర్ అల్లరి గురించి అంతగా మాట్లాడుతారు. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ సమయంలో తారక్ అల్లరి గురించి ఆడియన్స్ కి కూడా తెలిసింది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి వేదిక మీద రామ్ చరణ్, రాజమౌళిని టీజ్ చేస్తూ అల్లరి చేస్తూ కనిపించారు. ఇక ఈ అల్లరితోనే టీనేజ్లో హీరో శ్రీకాంత్ కొడుకు 'రోషన్'ని కిడ్నాప్ చేశారట. రోషన్ కూడా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ చిన్నతనంలో శ్రీకాంత్, ఎన్టీఆర్ పక్కపక్క ఇళ్లలో ఉండేవారట. ఇక రోషన్ తో ఆడుకునేందుకు ఎన్టీఆర్ ఇంటికి వచ్చేవారట. ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఎన్టీఆర్, రోషన్ ని తన ఇంటికి తీసుకు వెళ్లారట.
ఇక ఇంటిలో రోషన్ కనిపించపోయేప్పటికీ శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీ మొత్తం కాలనీ అంతా వెతికేస్తున్నారు. అసలు రోషన్ ఏం అయ్యాడో తెలియక.. శ్రీకాంత్ తెగ టెన్షన్ పడుతున్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వచ్చి.. "ఏంటి బాబాయ్, ఏమైంది అలా ఉన్నావు..?" అని అడిగారట. 'రోషన్ కనిపించడం లేదురా' అని శ్రీకాంత్ చెప్పారట. అది విన్న ఎన్టీఆర్.. "వాడు నా దగ్గర ఉన్నాడుగా" అంటూ కూల్ గా చెప్పారట. ఎన్టీఆర్ అంత అల్లరి చేసేవాడని, ఇంకా చేస్తూనే ఉన్నాడని శ్రీకాంత్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం శ్రీకాంత్, ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ సమయంలో రోషన్ సెట్స్ కి వెళ్లారట. దీంతో అప్పుడు జరిగిన కిడ్నాప్ సీన్ ని మల్లి గుర్తుకు చేసుకొని నవ్వుకున్నారట. ఇక దేవర విషయానికి వస్తే.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపు మొత్తం షూటింగ్ పూర్తి అయ్యిపోతుందని చెబుతున్నారు.
Next Story