Sun Jan 12 2025 01:37:19 GMT+0000 (Coordinated Universal Time)
Devil: నాలుగు రోజుల్లో డెవిల్ సినిమాకు ఎన్ని కలెక్షన్స్ వచ్చాయంటే?
4వ రోజు జనవరి ఫస్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద డెవిల్కి అతిపెద్ద రోజుగా
డిసెంబర్ 29వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' సినిమా విడుదలైంది. అభిషేక్ నామా బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా విడుదలై 4 రోజులు అవుతోంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.59 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
4వ రోజు జనవరి ఫస్ట్ కావడంతో బాక్సాఫీస్ వద్ద డెవిల్కి అతిపెద్ద రోజుగా మారింది. ప్రారంభ రోజు కంటే కూడా పెద్ద సంఖ్యలో కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రం న్యూ ఇయర్ రోజున భారీగా కలెక్షన్స్ ను సాధించింది. అద్భుతమైన ఆక్యుపెన్సీలను సాధించినా.. బ్రేక్ఈవెన్కు ఇది సరిపోతుందో లేదో తెలియని పరిస్థితి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.2 కోట్ల ఓపెనింగ్ డే సాధించగా.. 2వ రోజు, 3వ రోజు డ్రాప్ను చూసింది. కల్యాణ్ రామ్ కెరియర్ లో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా ఈ సినిమా గురించి చెప్పుకోవచ్చు.
మొదటి వారాంతంలో, ఈ చిత్రం దాదాపు 5 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. జనవరి 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2.5Cr షేర్ వసూలు చేసింది, దీంతో మొత్తం షేర్ సుమారు 7.5 కోట్ల రూపాయలకి చేరుకుంది. డెవిల్ థియేట్రికల్స్ విలువ 20 కోట్లు కాగా.. సెలవులు అయిపోవడంతో ఈ రోజు నుండి సినిమా మంచి కలెక్షన్స్ సాధించడానికి కష్టమవ్వనుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రేక్ఈవెన్ అసాధ్యం అనిపిస్తుంది. మాళవిక నాయర్, అజయ్, సత్య, ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సీత డెవిల్లో కీలక తారాగణంగా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం హర్షవర్ధన్ రామేశ్వర్ అందించారు. కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించారు.
Next Story