Mon Dec 23 2024 07:22:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ సినిమాకు హిట్ టాక్ వచ్చినా.. భారీ నష్టాలేనా?
నందమూరి కళ్యాణ్ రామ్ తాజా స్పై థ్రిల్లర్ డెవిల్ డిసెంబర్ 29 న విడుదలైంది
డెవిల్ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ తాజా స్పై థ్రిల్లర్ డెవిల్ డిసెంబర్ 29 న విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి స్పందనను అందుకుంది. విడుదలకు ముందు సరైన ప్రమోషన్స్ చేయలేదు.. అంతేకాకుండా సలార్ సినిమా విడుదలైన తర్వాతి వారమే ఈ సినిమాను విడుదల చేయడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టలేకపోయింది. వారాంతానికి సినిమా గొప్పగా కలెక్షన్స్ సాధించకపోయినా.. న్యూ ఇయర్ రోజున బాగా పుంజుకుంది. నాలుగు రోజుల పాటు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7.5Cr షేర్ వసూలు చేసింది, అయితే 5వ రోజు నుండి డెవిల్ బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. ఇక ఈ శని, ఆదివారాలు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.
వచ్చే వారమే సంక్రాంతి సినిమాల విడుదల ఉండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ దాదాపు మిగిలిపోయినట్లే. ఈ సినిమా 9 కోట్ల కంటే తక్కువగా షేర్ వసూలు చేయవచ్చని అంచనా. డెవిల్ థియేట్రికల్ రైట్స్ విలువ 20 కోట్లు కాగా.. ఈ కలెక్షన్స్ సినిమాకు నష్టం కలిగించే విషయమే. మాళవిక నాయర్, అజయ్, సత్య, ఎడ్వర్డ్ సోన్నెన్బ్లిక్, ఎల్నాజ్ నొరౌజీ, శ్రీకాంత్ అయ్యంగార్, సీత డెవిల్ సినిమాలో కీలక తారాగణం. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకుర్చారు. కళ్యాణ్ రామ్ నటించిన ఈ చిత్రం డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించారు.
Next Story