Mon Dec 23 2024 11:19:52 GMT+0000 (Coordinated Universal Time)
రూ.50 కోట్ల క్లబ్ లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్..
డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో.. ఐదురోజుల్లో రూ.50 కోట్ల మార్క్ ను అందుకుంది. మొదటి..
గతేడాది క్రాక్ సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ.. చాలాకాలం తర్వాత కమ్ బ్యాక్ మూవీ ఇచ్చాడనుకునేలోపే.. వరుస డిజాస్టర్లతో నిరాశపరిచాడు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో.. మళ్లీ డీలా పడిపోయాడు. రెండు డిజాస్టర్ల తర్వాత వచ్చిన ధమాకా కూడా డిజాస్టరే అవుతుందనుకున్నారు. కానీ.. త్రినాథరావు నక్కిన చేసిన మ్యాజిక్ తో.. మాసివ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు రవితేజ. ఈ 54 ఏళ్ల హీరో.. కుర్ర హీరోయిన్ శ్రీలీల తో కలిసి చేసిన డ్యాన్స్ కుర్రకారును ఉర్రూతలూగించింది.
డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో.. ఐదురోజుల్లో రూ.50 కోట్ల మార్క్ ను అందుకుంది. మొదటిరోజే రూ.10 కోట్లు పైగా కలెక్షన్స్ అందుకొని రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్గా నిలిచింది. నాలుగు రోజులోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41 కోట్లు గ్రాస్, రూ.21 కోట్లు షేర్ రాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించింది ధమాకా. ఈ వారం క్రిస్మస్ సెలవులు, వచ్చేవారం కూడా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో.. ధమాకాకు డబుల్ ధమాకా వసూళ్లు వస్తాయని అంచనా. న్యూయర్ నాటికి ధమాకా రూ.100 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. అదే జరిగితే.. రవితేజ సినిమాల్లో రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన తొలి సినిమా ఇదే అవుతుంది.
ఇక ఈ సినిమాలో హైపర్ ఆది.. రావు రమేష్ పై వేసే పంచులు కడుపుబ్బా నవ్విస్తాయి. విలన్ తో రవితేజ మైండ్ గేమ్, మధ్యలో ఇంద్ర మ్యూజిక్, పల్సర్ బైక్ సాంగ్ తో పాటు.. జింతక జింతక సాంగ్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి.
Next Story